తెలంగాణలో ఈ మధ్య వరుసగా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.. వరుస ఘటనలో వెలుగు చూస్తుండడంతో.. బెంబేలెత్తిపోతున్నారు తల్లిదండ్రులు.. ఇక, ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి ఒడిగట్టాడు. యువతి గొంతు కోసి పరారయ్యారు.. గాయాలపాలైన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
Read Also: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ కీలక సమావేశం
బాధిత యువతి వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాధితురాలిపై బైక్ పై మాస్క్ ధరించి వచ్చిన వ్యక్తి దాడిచేసి చేశాడు.. కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగువారు వచ్చి యువతిని చికిత్స కోసం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక, స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..