తెలంగాణలో ప్రభుత్వ బడులు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి.. అనూహ్యంగా అడ్మిషన్స్ పెరిగాయి.. ఈ క్రమంలో గతంలో విద్యార్థులు లేక మూతపడ్డ పాఠశాలలు సైతం ఈ మారు తెరుచుకున్నాయని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు మంచి స్పందన కనిపిస్తున్నా, తొలి ఏడాదిలో ఉపాధ్యాయుల సన్నద్ధత, పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరిగినట్టుగా కనిపించడంలేదు..
Read Also: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ కీలక సమావేశం
మొత్తంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ భారీగా పెరిగాయి.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినవారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది.. ఈ రోజు వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1,50,826 మంది చేరినట్టు విద్యాశాఖ చెబుతోంది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 14,379 మంది ప్రభుత్వ పాఠశాల్లో కొత్తగా చేచరగా.. సిద్ధపేట జిల్లాలో 6,927 మంది విద్యార్థులు, సంగారెడ్డి జిల్లాలో 9,194 మంది విద్యార్థులు, ఖమ్మం జిల్లాలో 8,810 మంది స్టూడెంట్స్, భద్రాద్రి జిల్లాలో 8,064 మంది విద్యార్థులు సర్కార్ బడి బాట పట్టారు.. ప్రభుత్వ పిలుపు మేరకు ఆయా పాఠశాలలకు చెందిన టీచర్లు కూడా విద్యార్థులను బడికి తీసుకురావడానికి మంచి కృషి చేయడం కూడా అడ్మిషన్స్ పెరగడానికి దోహదపడిందనే చెప్పాలి.