తెలంగాణలో గత 24 గంటల్లో 28,865 శాంపిల్స్ పరీక్షింగా కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు కేటీఆర్.. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్‌కు ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు వయస్సు 17 ఏళ్లు కాగా.. ఇద్దరు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..
హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూడడం కలకలం రేపుతోంది.. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు.
వారికి వచ్చేదే అరకొర జీతం.. పైగా అది కూడా సమయానికి చేతికి అందదు.. మూడు మాసాల పెండింగ్.. తమకు జీతం పెంచాలని, దాన్ని సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నా స్పందన కరువు.. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కుటుంబాన్ని నెట్టుకురాలేక అనేక అవస్థలు.. ఇదీ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల దుస్థితి. ఈ నేపథ్యంలో జీతాల కోసం నగరంలోని జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి GHMC కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ…
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్నిన్ ను ఎవర్ టెక్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడిపించడం, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరగుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా యూటర్న్ ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య .. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ( TS REDCO) చైర్మన్‌గా నియమితులైన వై. సతీష్ రెడ్డి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. తనను రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా నియమించినందకు ధన్యవాదాలు తెలిపారు.. కాగా, టీఎస్ రెడ్కో చైర్మన్‌గా వై సతీష్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం టీఆర్ఎస్…