పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో (గురువారం తెల్లవారుజాము) వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది. శుక్రవారం (అక్టోబర్ 3) దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాల మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. Also Read: Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే…
Telangana Weather Update: తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1 నాటికి అల్పపీడనంగా మారే…
Yellow and Orange Alerts Issued for Several Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప..…
Heavy Rains Today andmorrow in Telangana: హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్…
Heavy rains today and tomorrow in Telangana: సోమ, మంగళ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ…
Weather Report: తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా వరి, కందులు మొదలైన వర్షాధారిత పంటల సాగు రైతులకు ఇది గుడ్ న్యూస్. అయితే మరోవైపు వర్షం కారణంగా జనం అప్రమత్తంగా ఉండాల్సిన…
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సైతం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. విత్తనాలు వేసి వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,…
Rain Alert : తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు…
Temperatures increasing in Telangana: మొన్నటివరకు వణికించిన చలి.. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. మరోవైపు హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఎండ…
Telangana Weather Forecast Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణం చల్లబడగా.. చలి తీవ్రత పెరిగింది. గత 10 రోజులుగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన…