Telangana Weather Update: తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Speed Post: రేపటి నుంచే పోస్టల్ కొత్త రూల్స్ అమల్లోకి.. ఇకపై ఓటిపి ఆధారిత డెలివరీలు..
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదృతంగా సాగుతోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Women’s World Cup 2025: నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్.. శ్రీలంకతో భారత్ ఢీ!