Rain Alert : తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, అవసరమైతేonly బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
Hindupuram: నేడు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం!
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఉక్కపోత వాతావరణం ఉండొచ్చని సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో వడగాలులు ప్రభావం చూపనున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 144 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయి. నేడు ఏపీ లోని 70 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలిచ్చారు.
Taraka Rama Rao: పూజా కార్యక్రమాలతో మెదలైన తారక రామారావు సినిమా