పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో (గురువారం తెల్లవారుజాము) వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది. శుక్రవారం (అక్టోబర్ 3) దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాల మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్!
వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర సహా తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాలు, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలపడే అవకాశాలు ఉన్నాయి. గురువారం, శుక్రవారం రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తీరం వెంబడి ౩౦ కిమీ పైగా వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.