Uttam Kumar Reddy: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ వాదనల వివరాలను వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే అంశాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ రాష్ట్ర వాటా…
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు…
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోకుండా కట్టుబడి పని చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రోజున రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, కృష్ణా జలాల వివాదాల నేపథ్యంలో న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్…
Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా…
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. "మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం.