Uttam Kumar Reddy: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ వాదనల వివరాలను వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే అంశాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ రాష్ట్ర వాటా విషయంలో రాజీ పడేది లేదని.. కృష్ణా, గోదావరి జలాల్లో తమ వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Most Wanted Criminal: పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. రంగంలోకి 10 టీమ్‌లు..
తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ మూడు రోజుల పాటు వాదనలు వినిపిస్తున్నారు. కృష్ణా నది ప్రవాహం, క్యాచ్‌మెంట్ ఏరియా, జనాభా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకు 70 శాతం నీటి వాటా కేటాయించాలని కోరుతున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 TMCల నీటిని కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
PMUY Scheme: పేదలకు శుభవార్త.. కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు
గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తాము ఏకీభవించడం లేదని, అందుకే ఫైల్ రీఓపెన్ చేసి మొదటి నుంచి వాదనలను వినిపిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అండర్ సెక్షన్ 3 రిఫరెన్స్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఫిబ్రవరి నుంచి వాదనలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం తుది వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. ఈ వాదనలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే బ్రీఫింగ్ జరిగిందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పూర్తిస్థాయిలో పోరాడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.