Uttam Kumar Reddy : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తూ వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైంది.…