తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో స్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు. అయితే మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి…