Ande Sri on Telangana Thalli: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. గత పాలకులు అన్నట్లుగా అరుస్తున్నట్లుగా తెలంగాణ తల్లి లేదని, అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం అని ఆయన వాపోయారు. బతుకమ్మ దేవత, ఆ దేవతను, మరో దేవత నెత్తిన కిరీటం పెట్టుకుంటుందా..? మానవ రూపంలో కిరీటం సరైనది కాదని తెలిపారు.…
Jagadeesh Reddy Comments on Telangana Talli: అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరోసారి ప్రమాదం జరగబోతుందని, సినిమా పాటలతో ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే తాము సినిమా పాటలకు మేము వ్యతిరేకం కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు…
దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారని.. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోందని విమర్శించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏమీ మార్చలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక పార్టీలు అనేక ప్రతిరూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం చేసుకుందామంటూ ప్రజలకు తెలిపారు.
Telangana Assembly 2024: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
CM Revanth Reddy: రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. విగ్రహానికి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.