Harish Rao: తెలంగాణ 2వ స్థానంలో.. గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Launches Aspire Solutions At Hyderabad Gachibowli: ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్‌గా మారిందని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న విప్లవాత్మకమైన విధానాలే ఇందుకు కారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేవల్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళజాతి, ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో తమ విస్తరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశాయని తెలిపారు.
ఫ్లోరిడా, యూఎస్ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన ఫోనిక్స్ టెక్నాలజీస్.. హైదరాబాద్‌లో ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. తెలుగు విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. మూడు సంవత్సరాల్లో మూడు వేల కంటే ఎక్కుమంది ఉద్యోగుల్ని కలిగి ఉండేలా ఈ సంస్థ విస్తరించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆవిష్కరణల విషయంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. ఆవిష్కరణల సూచీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉంటే.. గుజరాత్, బీహార్ రాష్ట్రాలు మాత్రం 14, 15 స్థానాల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ కంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Also Read
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
- Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
- BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!