డబ్బింగ్ సినిమాలు, 'లైగర్' మూవీకి సంబంధించిన వివాదాలపై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ తీసుకుంది.
ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త…