Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో ఒడిశాకు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది.
Sangareddy: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.
తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతం తగ్గడం లేదు.
రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది వరదతో గోదావరి పోటెత్తింది. మహారాష్ట్రలో ఎగువన గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి 10.090 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం పెరిగింది.
TS Red Alert: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దయింది.
TS Rain: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు.