Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు బండులు పగిలే మండుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీలు ఉంటుంది. వేసవి కాలంలో అడపాదడపా వర్షాలు కురిసినా ఎండలు మండిపోతున్నాయి. కానీ ఈసారి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. భానుడు భగభగ మండుతున్న సమయంలో వరుణుడు కుండపోత వర్షాలు కురిపిస్తున్నాడు. వాతావరణం పూర్తిగా చల్లబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి వర్షాకాలంగా మారిపోయింది. ఇది వర్షాకాలమా? ఇది వేసవి కాలమా? అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.
కాగా.. రానున్న రోజుల్లో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపించనున్నాడు. మే 8 నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. మే 8 నుంచి రాష్ట్రంలో తీవ్ర వేడి గాలులు వీస్తాయని.. వర్షాలు పూర్తిగా ఆగిపోయాయని, ప్రతి రోజూ వేడిగాలులు వీస్తాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది వేసవి మాదిరిగానే ఈ ఏడాది కూడా మే 8 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు.
Read also: Rangareddy Crime: కన్న బిడ్డను అమ్మింది.. సంచిలో శవమైంది
అయితే చల్లటి వేసవి త్వరలో వేడి వేసవిగా మారుతుందని తెలిసి చాలా మంది నిరాశ చెందగా, మరికొందరు వర్షాల కంటే ఎండలు మంచివని అంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని.. ఈ సమయంలో కురుస్తున్న వర్షాల కంటే ఎండలు బాగానే ఉన్నాయని అంటున్నారు. వర్షాకాలంలోనే వర్షాలు కురిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వారం చివరి వరకు వర్షాలు..
మరోవైపు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వారం చివరి వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలతో పాటు భారీ ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి 7 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..