Minister Mallareddy Exclusive Interview: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పదేళ్లలో తాము చేసిన అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో ఇంకెన్నో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తామని హామీలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా తనదైన శైలిలో మేడ్చల్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటున్నారు మంత్రి చామకూర మల్లారెడ్డి. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. ఎన్టీవీ ప్రతినిధులు సంధిస్తోన్న ప్రశ్నలకు.. మంత్రి మల్లారెడ్డి ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..