Kadiyam Srihari : బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది…
KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనబడింది. కేటీఆర్‌తో పాటు, బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. HMPV Virus:…
Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉందని,…
CM Revanth Reddy : రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో…
Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా…
KP Vinekananda : మెట్రో ప్రాజెక్టును శామీర్ పేట, మేడ్చల్ వరకు విస్తరిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుందన్నారు కేపీ వివేకానంద. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో మూడో దశ విస్తరణకు కన్సల్టెంట్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియమించిందని, రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చి రాగానే కేసీఆర్ ఆనవాళ్లు…
Komatireddy Venkat Reddy : రైతు భరోసా పై… పనికి మాలిన వాడు… పని లేనోడు విమర్శలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RRR లో 12 వేల కోట్ల అవినీతి అని కేటీఆర్ అంటున్నాడని, టెండర్ పిలిచింది 7 వేల కోట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేటీఆర్..హరీష్ మానసిక పరిస్థితి సరిగలేదని ఆయన సెటైర్ వేశారు. అధికారం ఇక రాదని అర్థమైంది వాళ్లకు…
CM Revanth Reddy : తనకు కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. నేను మారిన… మీరు మారండని, ఇవాళ అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పని తీరు… ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్ లు నా దగ్గర ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా అని, అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా అని ఆయన…
MLC Kavitha :తెలంగాణ రాష్ట్ర బీసీల హక్కులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3న నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్‌ను కవిత బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో…
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది…