Bandi Sanjay : అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రూ.28 వేల400 కోట్ల జల్ బోర్డ్ కుంభకోణం, రూ.4,500 కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణం, బస్సుల్లో సదుపాయాల పేరుతో రూ.500 కోట్ల దుర్వినియోగం, నకిలీ హెల్త్ టెస్టుల ద్వారా కోట్ల రూపాయల అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు…ఢిల్లీ సమగ్ర అభివ్రుద్ధికి మలుపు కాబోతోందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు (ఆదివారం) ఉదయం బీజేపీ తెలంగాణ కోశాధికారి భండారి శాంతికుమార్, పార్టీ ఢిల్లీ ప్రతినిధి నూనె బాలరాజుతో కలిసి ఈస్ట్ ఢిల్లీ, షాద్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో బనియా, బ్రాహ్మణ, వాల్మీకీ సామాజికవర్గ ప్రజలు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు.
Awadhesh Prasad: ‘‘రామ్, సీతా మీరు ఎక్కడ ఉన్నారు..?’’ విలపించిన అయోధ్య ఎంపీ..
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ఆడంబరాలకు, అవినీతికి దూరంగా ఉంటూ పాలన కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ నేతలు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రజా ధనాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజలను మాత్రం బిచ్చగాళ్లలో మార్చారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు సాదాసాదీ జీవితం గడిపిన ఆప్ ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం స్కాం తెలంగాణకు విస్తరించిందని, ఈ స్కాం ఢిల్లీ ప్రజలు తలదించుకునేలా చేసిందన్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కవిత ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అవినీతి కేసుతో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ కోర్టు ఒత్తిడి చేస్తే బలవంతంగా రాజీనామా చేయకపోవడం ఆయన స్వార్థపూరిత రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందని మండిపడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అబద్ధపు, మోసపూరిత రాజకీయాలతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారన్నారు. మార్పు కోసం, ఢిల్లీ అభివ్రుద్ధి కోసం బీజేపీవైపు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మహిళా సమృద్ధి యోజన’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, రూ.500 లకే ఉచిత గ్యాస్ సిలిండర్, ముఖ్యమంత్రి మాతృత్వ భద్రతా పథకం కింద గర్భిణీ స్త్రీలకు రూ. 21,000తోపాటు 6 పోషకాహార కిట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తాము, దీని ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. దీంతోపాటు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామన్నారు.
Shocking: కాలేజీలో బిడ్డకు జన్మనిచ్చి, డస్ట్‌బిన్‌లో పారేసిన విద్యార్థిని..