R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన…
Bandi Sanjay : కరీంనగర్లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు.
క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…
Padi Kaushik Reddy : హుజురాబాద్MLA పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే… కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే సుబేదారి పోలీస్ స్టేషన్‌కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా… రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తన…
Padi Kaushik Reddy : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో, సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదులో, రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. CM Chandrababu : సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం.. గిరిజన విద్యార్థులు…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. కేంద్రంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో…
MLC Kavitha : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భద్రాచలం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే తెలంగాణ జాగృతి…