Kishan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీల సమస్యలకన్నా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతోనే రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నాడు. 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా రాహుల్, సోనియా పేర్లే జపించాడు” అని విమర్శించారు. “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన అంశాలు 18 నెలలుగా ఎందుకు అమలు కాలేదు? బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు. రజకులు, గౌడ్లతో పాటు అన్ని వర్గాలను మోసం చేశారు,” అని అన్నారు.
Perni Nani: ఇల్లు అలకగానే పండగ కాదు..! రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో ఆలోచించుకోండి..!
“జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సీట్లలో ముస్లింలు గెలిచిన పరిస్థితి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తే, బీసీలకు నష్టం తప్పదని తెలంగాణ సమాజం గ్రహిస్తోంది. అశాస్త్రీయ సర్వేతో బీసీల సంఖ్య తగ్గించి, ముస్లింలను చేర్చి మోసం చేస్తున్నారు,” అని కిషన్ రెడ్డి ఆరోపించారు. “1955లో కాకా కాలేల్‌కర్ కమిషన్‌ను నెహ్రూ పక్కన పెట్టాడు. ఇందిరా, రాజీవ్ గాంధీలు మండల్ కమిషన్‌ను విస్మరించారు. ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడు అదే క్రమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది,” అని విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, వరుస ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోతోందని కిషన్ రెడ్డి అన్నారు. “నరేంద్రమోదీ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. మోదీ నేతృత్వంలో సుస్థిరమైన పాలన అందుతోంది. వచ్చే 30 ఏళ్లలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం మానేయాలి,” అని ఆయన స్పష్టం చేశారు.
KA Paul Warns Vijay: విజయ్ దేవర కొండకు కేఏపాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. 24 గంటలు డెడ్‌లైన్..!