Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి,” అని జగ్గారెడ్డి అన్నారు.
“మీరు దొంగలు.. మాపై నిందలు వేస్తారా? మీ పార్టీలా మేము ప్రైవేటు కంపెనీ అనుకున్నామా? ఔటర్ రింగ్ రోడ్ లీజుకు ఇచ్చి దాంట్లో డబ్బులు కొట్టారు. అప్పుల్లో కూడా కమిషన్లు వసూలు చేశారు. ఇలాంటి దందా ఎవడు చేయడు.. కానీ మీరు చేశారు,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ కూతురు ఢిల్లీ లో పెద్ద దుకాణం తెరిచింది. కేజ్రీవాల్ కథ ముగిసిపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం డాన్‌ల కంపెనీ అయింది. మిగిలింది ఏమీ లేదు.. చెరువులు కూడా మింగేశారు,” అని వ్యాఖ్యానించారు.
Tension in Nandigama: వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
“లిక్కర్ దందా పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి రెండు గంటల వరకు సాగుతోంది. నేను పోలీసులను అడిగితే అది కేటీఆర్ బామ్మర్ది దందా అంటున్నారు. రోడ్డుకి లెఫ్ట్ కేటీఆర్ బావమరిది, రైట్ సంతోష్ సుట్టాలు.. ఇది ఏమి దందా? మొగోడివైతే స్పందించు ప్రభాకర్ రెడ్డి,” అంటూ కౌంటర్ వేశారు. “రేవంత్ రెడ్డిని ఎంతగా వేధించారు. జగ్గారెడ్డి, రేవంత్ ఇద్దరమూ కేసీఆర్ కుట్రల బాధితులమే. రేవంత్ బెడ్‌రూం వరకు పోలీసులు చొరబడ్డారు. ఇది ఏ స్థాయి దౌర్జన్యం చెప్పండి. కానీ రేవంత్ మాత్రం మిమ్మల్ని కొడుతున్నాడా? తిడుతున్నాడా?” అంటూ ప్రశ్నించారు.
“బీజేపీ వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. గాంధీ కుటుంబం మాత్రమే దేశ మత సామరస్యాన్ని కాపాడుతుంది. కరెన్సీ మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలి అనేది బీజేపీ లైన్. వాళ్లది బ్లాక్ మెయిల్ దందా,” అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
US President’s Salary: యూఎస్ ప్రెసిడెంట్ సాలరీ ఎంతో తెలుసా..?