మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు.
CM Revanth Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు. “కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016లో హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మరో వ్యక్తి లక్ష్మయ్యలపై కేసు నమోదైంది. Shocking: పనిలో మేనేజర్ టార్చర్.. 15 సార్లు పొడిచి చంపిన మహిళ…
Jagadish Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులను, గోదావరి నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ డిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. బనకచర్ల అంశాన్ని సీఎం రేవంత్ reddy ఎజెండాలో లేనట్టుగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జగదీష్ రెడ్డి. ఇదే విషయంపై ఏపీ మంత్రి రామానాయుడు నిపుణుల కమిటీ వేశామని…
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన…
CM Revanth Reddy : తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ టీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూలై 12న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంతర్జాతీయం, సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ smt. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి మల్లన్న…