TPCC Mahesh Goud : కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా
- కవిత కామెంట్స్‌పై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కవిత కూడా కీలకంగా ఉన్నారు
- కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా.?
- పదేళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు వాటాలో తేడా వచ్చి బయటపడ్డారు
- కవిత ఆధారాలు ఇస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ముఖచిత్రం ఉండదు. -మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Nandigama : రూ.3.10 కోట్లు నోట్లతో అలంకరించిన గణపతి విగ్రహం
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
కవిత నిజంగా అవినీతి విషయాల్లో ఆధారాలు ఇస్తే వాటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని PCC చీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లిక్కర్ మార్ట్ కేసు, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రిపై ఎత్తేసిన కేసు వంటి అంశాలపై సరైన వివరాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్‌పై స్పై చేయాల్సిన అవసరం లేదన్నారు. “స్పై చేయడం మాకు అలవాటు కాదు.. ఫోన్ ట్యాప్‌లు మీరు చేశారు. మీరు మీలో మీరే గొడవ పడి బయటపడుతున్నారు” అంటూ బీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన కవిత ఇటీవలే అమెరికా నుండి తిరిగివచ్చిన తర్వాత హరీష్ రావు, సంతోష్‌పై ఆరోపణలు చేయడం, అంతకు ముందు కేటీఆర్‌పై విమర్శలు చేయడం బీఆర్ఎస్ లోపల విభేదాలను బహిర్గతం చేస్తోందని అన్నారు.
కవిత రాజీనామా చేయడాన్ని మహేష్ గౌడ్ స్వాగతించారు. నైతికతకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం శుభపరిణామమని అన్నారు. “కవిత కేసీఆర్ వదిలిన బాణం మాత్రమే. ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అయితే నైతికతతో తీసుకున్న ఈ నిర్ణయం సానుకూలమే” అని వ్యాఖ్యానించారు. అంతేకాక, రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ రాజకీయ ముఖచిత్రంలో ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కవిత, కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!