Kalvakuntla Kavitha : మరోసారి కవిత హాట్ కామెంట్స్.. కొందరిలో స్వార్థం ప్రవేశించిందంటూ
- మరోసారి కవిత హాట్ కామెంట్స్
- నా వెనుక ఏ జాతీయ పార్టీ లేదు
- కొందరిలో స్వార్థం ప్రవేశించింది
- వారివల్ల కోట్లాదిమంది బాధపడోద్దన్నదే నా తపన
- చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నా
- దురదృష్టకర పరిస్థితుల్లో గత ఏడాది బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్నా. -కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha : లండన్‌లోని తెలంగాణ ప్రవాసులతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. జాగృతిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే తమ సంకల్పమని, సామాజిక తెలంగాణ కోసం జాగృతి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ‘‘ప్రజలు అవసరం అనుకుంటే, సరైన సందర్భంలో పార్టీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజల జీవితాల్లో మార్పు తేవడం మా లక్ష్యం. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు సమయం ఉంది.. అప్పటివరకు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం’’ అని వ్యాఖ్యానించారు.
తాను ఏ జాతీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని కవిత స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ. అభివృద్ధి దారిలో ఉన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. మరోవైపు, భాజపా డీఎన్‌ఏ నాకు సరిపడదు’’ అని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి కోసం రెండు దశాబ్దాలపాటు తాను కష్టపడ్డానని, కానీ పార్టీలో కొందరి స్వార్థం వల్ల పరిస్థితులు దిగజారాయని కవిత అన్నారు.
Also Read
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!
‘‘కోట్లాది మంది బాధపడకూడదనే ఉద్దేశంతోనే పార్టీలో చీలికలు రాకుండా తట్టుకొని నిలబడ్డాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఓటమి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు అనేక కుట్రలు జరిగాయి. విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత మౌనం వహిస్తే తప్పవుతుంది కాబట్టి, ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది’’ అని ఆమె వివరించారు.
‘‘పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టి నేనూ పార్టీ ఇచ్చిన పదవిని తిరస్కరించాను. నిర్ణీత విధానం ప్రకారం రాజీనామా చేశాను. కానీ ఛైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. ఈ పరిస్థితికి నేను కారణం కాదు.. అవతలివాళ్లే కారణం’’ అని కవిత స్పష్టం చేశారు. జైలు జీవితం తనలో అనేక మార్పులు తెచ్చిందని, సమూలంగా మార్చేసిందని కవిత అన్నారు. ‘‘నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై కృషి చేయాలి. కష్టాలు ఎదురైనా, కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా ముందుకు వెళ్తాను’’ అని ఆమె స్పష్టం చేశారు.
Tilak Varma: “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉంది..
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!