కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్పై సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?అని ఆమె వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కేసీఆర్పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు.