Harish Rao: నువ్వేం.. ముఖ్యమంత్రివి..? సీఎంపై మాజీ మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేటలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు (అక్టోబర్ 5) పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను వారు పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే స్థానిక ఇన్చార్జ్ మంత్రుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hit and Run: మదం తలకెక్కితే.. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు అరెస్ట్
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
“వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం ముఖ్యమంత్రివి?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అలాగే ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు పట్టింపు లేదు, ముఖ్యమంత్రికి సోయి లేద అంటూ మంత్రుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25,000 నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ” అని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని, కానీ ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, ఒక ప్రాజెక్టు కట్టలేదని, ఒక చెక్ డ్యాం కట్టలేదని విమర్శించారు.
Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!
అలాగే పోచారం కాలువ సమస్య: పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంట కూడా పోచారం కాలువ మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి, వెంటనే కాలువలోని గండ్లను పూడ్చాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని హరీష్ రావు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?