తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు…
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. Bollywood…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రెస్ మీట్ ముగింపు సమయంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తుచేశారు.
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు.