Telangana BJP Meeting: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, నేడు (అక్టోబర్ 5) రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం మరియు అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం…
తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.
బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర... ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా వేయలేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగంగా వెల్లడైన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. ఈ సమయంలో, నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగగా, తదుపరి దశలో అక్టోబర్ 1న పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామైన్ చేయనున్నారు.
KTR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని అంటున్నారని విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు…
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఆయన తెలిపారు.