హైదరాబాద్‌లో మరో రాజకీయ కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆత్మగౌరవం, దేశభక్తి విలువలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధాటిగా విరుచుకుపడ్డారు. "ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మేలు చేసేలా లేదు, ముడుపుల పాలనగా మారింది" అంటూ ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టి కంపెనీ తప్పుకోవడానికి సీఎం రెవంత్ రెడ్డి వ్యవహార శైలి, బెదిరింపులే కారణమని ఆయన ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ (X) వేదికగా బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.