నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ, టి.కాంగ్రెస్ వరుస కార్యక్రమాలతో హాట్ హాట్ గా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ భారీ సభకు ప్లాన్ చేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఢిల్లీ దూతలు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.
అధికారపార్టీ బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి వచ్చిపడిందా? ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీల పంచాయితీ ఉండగానే.. కొత్తగా మరో రగడ మొదలైందా? కొంతమంది జడ్పీ చైర్మన్ల తీరు చర్చగా మారిందా? జిల్లాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం ఏం చేయబోతుంది? జడ్పీ ఛైర్మన్లు వర్సెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కట్టబెడుతూ వస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా స్థాయిలో పదవుల్లో…
OFF The Record: ఆయన బీజేపీలో కీలక నేత. ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తన వాగ్ధాటితో ఎదుటివారిని కట్టడి చేసే ఆయనకు.. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. అసమ్మతి పేరుతో నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు వేడి రాజేస్తున్నాయి. అదెక్కడో.. ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. దుబ్బాక బీజేపీలోని సీనియర్లు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? కాషాయ శిబిరంలో ఎందుకు కలకలం? ప్రస్తుతం టీ బీజేపీలో…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతం లోనే ఈడీ నోటీస్ లు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈడీ విచారణను నిలిపివేయాలంటూ.. హైకోర్టులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. రోహిత్ రెడ్డి పిటిషన్ బుధవారం (రేపు 28న) హైకోర్ట్ లో విచారణకు రానుంది.
Bandi Sanjay criticizes Minister KTR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ విత్ డ్రావల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన…