Minister Ponguleti Srinivas Reddy: పాడైంది పన్ను కాదు.. వెన్నెముక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti Srinivas Reddy: ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చెప్పినట్లుగా పాడైంది పన్ను అయితే బాగుండేది కానీ కేసీఆర్ అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ, మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యం. మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, మొఖం ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. మేడిగడ్డ తర్వాత అన్నారం సుందిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే పరిమితం కాలేదని, ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని అన్నారు. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపీ మేస్త్రి అనే విధంగా వ్యవహరించారని కాళేశ్వరం కేసీఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు.
Read ALso: Aroori Ramesh: కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్
Also Read
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ఎత్తిపోతల…. తిప్పిపోతల… కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగినవని సాక్షాత్తు ఎన్డీఎస్‌ఏ, కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, మన ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు… మేధావులు….రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్ట్‌లు ఇలా ప్రజలు అందరూ ఏకరువు పెడుతుంటే.. అపర మేధావి కేసీఆర్ సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలు పాల్గొనకుండా పారిపోయిన పెద్దమనిషి 80వేల పుస్తకాలు చదివిన మేధావి కాళేశ్వరం రూపశిల్పి ఇప్పుడు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతారంట అని ఎద్దేవా చేశారు.
భూమి ఆకాశం ఉన్నన్నిరోజులు బీఆర్ఎస్ ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ .. టీఆర్ఎస్ స్థానంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని, దేశంలో గత్తెర లేప్తా, భూకంపం సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో పోటీ చేయలేక చేతులెత్తేయగా, ఉన్న రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ కుర్చీ మడత పెట్టారని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్‌కు అభ్యర్థులు దొరకలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ? మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిందని, అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ లోకల్.. వినోద్ వలస పక్షి..
ప్రజలు అత్యాశకు పోయారని ప్రజాతీర్పును కేసీఆర్ చులకన చేస్తున్నారని, తనకు ఓటు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం ప్రజలకు తెలివి లేదు మూర్ఖులు అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాము అని ఈరోజు వరకు కేసీఆర్ నోటినుండి వెలువడిందా ? ప్రజా తీర్పును ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం ఎంత వరకు సమంజసం ? కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాపీ చేసి 400కు సిలిండర్ ఇస్తానంటే కూడా కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష గురించి కేసీఆర్ మాట్లాడడం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉందన్నారు. పీకడానికి , తోక మట్ట బొందలగడ్డ సన్యాసి రండ వంటి పదాలను అలవోకంగా వదిలేసింది కేసీఆర్ కాదా ? తెలంగాణ రాజకీయాల్లో నీచమైన భాష తిట్ల ప్రయోగాలకు కేసీఆర్ ఆద్యుడు అని విమర్శించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?