ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని..
ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలని బండిసంజయ్ సతీమణి అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా బండి సంజయ్ తో జిల్లా జైలులో కుటుంబ సభ్యులు వెళ్లి కలిసారు.