తెలంగాణలోని పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఆ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో భారీగా దరఖాస్తుల వచ్చాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 7వ తేదీన ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే.. ఈ క్రమంలోనే నేడు తాజాగా తెలంగాణ స్టేల్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ రావు స్ఐ ప్రిలిమ్స్ కీ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 13 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 15న సాయంత్రం 5 గంటలకు వరకు బోర్డుకు తెలియజేయాలని సూచించారు వివి శ్రీనివాస్ రావు.
అయితే.. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు వేరువేరుగా వెబ్‌సైట్‌లో సూచించిన విధానంలోని టెంప్లేట్స్ ఫార్మెట్‌లో ఆన్‌లైన్‌లోనే పంపాలని సూచించారు వివి శ్రీనివాస్ రావు. తమ అభ్యంతరాన్ని ధృవీకరించేందుకు సరైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలని వివి శ్రీనివాస్ రావు సూచించారు. అసంపూర్తి సమచారంతో పంపే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవని పేర్కొన్న వివి శ్రీనివాస్ రావు.. మ్యానువల్‌గా పంపే అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోబడదని, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని ప్రకటనలో తెలిపారు.