Constable Sowmya : సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల సాయం.! సోదరుడికి సర్కార్ ఉద్యోగం.!
- గంజాయి ముఠాతో పోరాడి వీరమరణం
- వాహనంతో ఢీకొట్టి పరారైన నిందితులు
- నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- కుటుంబానికి రూ.1 కోటి సాయం, సోదరుడికి ఉద్యోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విధి నిర్వహణలో గంజాయి మాఫియా పాలిట సింహస్వప్నంగా మారి, వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (26) సాహసం యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను అడ్డుకున్న ఆమె మృతి పట్ల ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో చేరిన ఏడాది కాలంలోనే ఆమె చూపిన తెగువ, గంజాయి ముఠాను పట్టుకోవడంలో ఆమె కనబరిచిన పట్టుదల పోలీసు శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించిన సౌమ్య మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.
KCR : కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ..!
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా కదలికలను గమనించిన ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకునేందుకు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య.. ముఠా సభ్యులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పట్టుబడతామనే భయంతో ఆ గంజాయి ముఠా ఆమెను వాహనంతో బలంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినప్పటికీ, శనివారం ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటనలు చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు గాను ఆమె కుటుంబానికి కోటి రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాకుండా సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
India Budget 2026: మధ్యతరగతి ఆశలపై నీళ్లు.. సామాన్యుడి కన్నీళ్లు తుడవని నిర్మలమ్మ!
విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గారి భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో నివాళులర్పించాను. ఈ సందర్భంగా సౌమ్య గారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాను.
సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. సౌమ్య తమ్ముడికి… pic.twitter.com/EnIMjmsIoI
— Jupally Krishna Rao (@jupallyk_rao) February 1, 2026
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!