Konda Vishweshwar Reddy : చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నేను ఇవాళ సాయంత్రము పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దుర్ఘటనలో గురించి తెలిసిందని, తీవ్ర ఆందోళనకు లోనయ్యానన్నారు. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినారు అని, పది మందికి పైగా తీవ్రమైన గాయాలు అయ్యాయని నాతో చెప్పారని, హైదరాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు పోతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా…
అభివృద్ధి అంతకంటే లేదు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా…
భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి స్నానఘట్టాలు: కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి…
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండ తిమ్మాపూర్లో కొకకోలా ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఇద్దరు మంత్రులు పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపన చేయనున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. జిల్లా జెడ్పి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాలు కమిషన్ స్వీకరించనుంది.…
దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు: టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి…
కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది: గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో…
నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించనున్నారు. ఈరోజు నెల్లూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. ఒంగోలులో మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. పుదుచ్చేరి…
Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు.
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
ఎవరైనా తప్పించుకోలేరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. సోదరుడి…