నేడు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ 2k రన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత హాజరుకానున్నారు.
ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
నేడు రాయచోటిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు.
నేడు గుంటూరులో కేంద్ర ,రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జింఖానా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ రెండు అంతస్తుల విస్తరణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు.
ఈరోజు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మధిరలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. నేడు రెండో రోజు ఆట కొనసాగుతోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది.