నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని గుట్టపల్లి, సోమవరం, శెట్టిపల్లి గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు.
ఈరోజు మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఉదయం 11 గంటలకు విజయనగరం చేరుకొని.. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం ప్రజలనుంచి వినతులను స్వీకరించనున్నారు.
నేడు మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడలో టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఏపీలోని గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5:15కు చేరుకుంటారు.
మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది.
లోకసభలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది.
నేడు ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోకసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మూడో రోజు జరుగుతోంది.