కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కర్షకులకు అండగా కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఈ రోజు లాటరీ నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు కొత్త మద్యం దుకాణాలకు రూ.2లక్షలతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాటరీ ద్వారా కొత్త దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో మద్యం దుకాణాల లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీలకు 262, ఎస్టీలకు…