బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయ్. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసింది. 26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టాం. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయి.రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదు.బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశం తెరమీదకు వచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
నా ప్రకటన వల్ల, మా రాష్ట్ర అధ్యక్షుడి స్టేట్మెంట్ వల్ల ధాన్యం ఉత్పత్తి పెరగదు.గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం చివరి గింజ కొంటాము.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొదుపు సంఘాలు కూడా ధాన్యం కొనుగోలు చేశాయి.గోనె సంచి డబ్బులు కూడా కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ మిగులుతుంది. కేంద్రానికి పూర్తి స్థాయి మిషనరీ లేదు. కేంద్రం నేరుగా బాయిల్డ్ రైస్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే అధికారం లేదు.
ఐదు ఆరు సంవత్సరాలుగా రైస్ మిగిలి పోతుంది. 2లక్షల60 వేల కోట్ల రూపాయల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మళ్ళీ మూడు రూపాయల బియ్యం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నాం. రా రైస్ స్ట్రాక్ దేశంలో పేరుకుపోయింది. రాజకీయాల కోసం కొంటే ప్రజల డబ్బులు వృధా అవుతాయి. గొడవలకు కారణం హుజురాబాద్ ఎన్నికలే. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈటెల రాజేందర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. దాన్ని మేము అడ్డుకోలేము కదా? ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాని గడ్డం, బట్టలపై విమర్శించడం సరికాదు.
ఉక్రెయిన్, రష్యా కారణంగా అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సబ్సిడీ ఇవ్వొచ్చు కానీ ఎంతమేర సబ్సిడీ ఇవ్వగలం. బీజేపీకి లైఫ్ లైన్ యూపీ.. అక్కడ దెబ్బతింటే మా పార్టీకి తీరని నష్టమని భావిస్తాం. రాజకీయ పార్టీల కోసం బడ్జెట్ పెట్టలేదు… ప్రజల కోసం బడ్జెట్ పెట్టాం. పంజాబ్ లో మా తప్పిదం వల్లే ఓటమి పాలైయ్యాం. కుటుంబ పాలన, పెత్తనం, నియంతృత్వము భరించలేక ఆయన బయటకు వచ్చారన్నారు కిషన్ రెడ్డి.