తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు…
హైదరాబాద్ లో ఓ హోటల్లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా…
ధాన్యం కొనాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు.ఆ దారిలో వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గరినుంచే అధికారులకు ఫోన్ చేశారు. కొనుగోలు కేంద్రాల వల్ల నిల్వ వుంచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ హామీతో ఆందోళన విరమించారు రైతులు. అంతుకుముందు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు. దీంతో…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కర్షకులకు అండగా కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఈ రోజు లాటరీ నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు కొత్త మద్యం దుకాణాలకు రూ.2లక్షలతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాటరీ ద్వారా కొత్త దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో మద్యం దుకాణాల లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీలకు 262, ఎస్టీలకు…