Hyderabad Doctor: హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ సుమధుర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన 'మాస్ పార్టిసిపేషన్ ఈవెంట్'కి గాను ఆమె ఈ ఘనత సాధించారు. ఆ ఈవెంట్లో 117 దేశాలకు చెందిన 1465 మంది వ్యక్తులు పాల్గొన్నారు.
హవాలా లావాదేవీలకు సంబంధించి క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కుమార్, అతని సహచరుడు మాధవరెడ్డి, సంపత్ లను ఇవాళ ఈడీ వరుసగా మూడోరోజు విచారణ చేపట్టింది. మొదటి,రెండవ రోజుల్లో సుధీర్ఘంగా విచారించిన ఈడీ, క్యాసినో పేరుతో విదేశాలకు తరలించిన నగదు ఎంత? ఎవరిది అనే కోణంలో విచారణ చేపట్టింది. విదేశీ బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే గుర్తించిన ఈడీ, హైదరాబాద్ లో జరిగన చెల్లింపుల్లో హవాలా ఏజంట్ల పాత్రపై విచారణ జరుపుతుంది. సీనీ స్టార్స్, రాజకీయ నేతలు, వీఐపీల పాత్రపై…
SC Categorisation: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మళ్లీ తెరమీదికి రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమలైన ఏబీసీడీ వర్గీకరణ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు బ్రేక్ వేయటమే దీనికి ప్రధాన కారణం.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్‌పేట్, పంజాగుట్ట,…
Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను రాష్ట్ర పత్నిగా అభివర్ణిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఎస్టీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేక భారత ప్రథమ పౌరురాలిపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు…
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ హసన్ నగర్ లో శివారులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. తాజాగా హసన్ నగర్ లో.. గాంజా గ్యాంగ్ హల్ చల్ సృష్టించింది. హలీమ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసారు. సుమారు ఆరు మంది హలీమ్‌పై దాడి చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో యువకుడిపై దాడి చేసి చెరువులో పడేసి వెళ్లిపోయారు. యువకుడి అరుపులు కేకలు విని చెరువులో…