నాగోల్ బంగారం చోరీ ఘటన.. సుఖేదేవ్ పరిస్థితిపై ఉత్కంఠ
నాగోల్ బంగారం చోరీ ఘటన భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నాగోల్ స్నేహపురి కాలనీలో వున్న బంగారం షాప్ లో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చి షాప్ లోపలికి వెళ్లి షట్టర్ ని మూసివేసి బంగారం దోచుకున్నారు. తమతో తెచ్చుకున్న తుపాకులతో షాప్ యజమాని కళ్యాణ్ సింగ్‌తో పాటు వర్కర్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈఘటన పై వైద్యులు ఎన్టీవీతో మాట్లాడారు. సుఖేదేవ్ పరిస్థితి 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమన్నారు. బుల్లెట్ బయటికి తీస్తే గానీ సుఖేదేవ్ పరిస్థితి చెప్పలేమని క్లారిటీ ఇచ్చారు.
మావోయిస్టుల వారోత్సవాలు.. పోలీసులు హై అలర్ట్
మావోయిస్టు వారోత్సవాల నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు పోలీసుల ముమ్మరం చేశారు. నేటి నుండి ఈ నెల 8వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప్రత్యేక బలగాలతో అటవీ,గ్రామీణ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో,లోతట్టు గ్రామాలు, అంతరాష్ట్ర వంతెనల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టి అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు.
Read also: HIT 2: మేకర్స్ చేసిన అతిపెద్ద తప్పు అదే…
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
క్రిస్మస్ స్టార్ పెడుతుండగా విషాదం
అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా గుడిమెల్లంకలో స్థానిక ఓబెరు చర్చిలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 70 కిలోల స్టార్ లైట్‌ను చర్చి పిల్లర్‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెలిమి శివకృష్ణ (27) అనే యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
Read also:Tesla: టెస్లా నుంచి హెమీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఆవిష్కరించిన ఎలాన్ మస్క్
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదం
ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్.. టాప్10 కంపెనీలు ఇవే..
భారతదేశంలో అత్యంత విలువైన సంస్థల జాబితాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటిస్థానంలో నిలిచింది. భారతదేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. ‘2022 బుర్గుండి ప్రేవట్ హురున్ ఇండియా 500 టాప్ 10’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తం అన్ని కంపెనీల మొత్తం విలువ రూ. 226 లక్షల కోట్లు( 2.7 ట్రిలియన్ డాలర్లు)గా ఉంది. భారతదేశం నుంచి 500 అత్యుత్తమ విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ తరువాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉండగా.. మూడో స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు ఉన్నాయి.
Read also:Konaseema District: మల్కీపురం మండలంలో విషాదం.. యువకుడి ప్రాణం తీసిన క్రిస్మస్ స్టార్
‘హిట్ 2’ ట్విట్టర్ లో రివ్యూస్
అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో రివ్యూస్ ఇస్తున్నారో చూద్దాం. ‘హిట్ 1’కి సీక్వెల్ గా వచ్చిన ‘హిట్ 2’ చూసిన ఆడియన్స్… సినిమాకి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒకరు సినిమా సూపర్ హిట్ అంటే, ఇంకొకరు పర్లేదు ఒకసారి చూడొచ్చు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో హై లేదు. కిల్లర్ ని రాంగ్ కాస్టింగ్ చేశారని కొంతమంది ట్వీట్ చేస్తుంటే, మరికొంతమందేమో కిల్లర్ పార్ట్ సూపర్ ఉంది అంటున్నారు. ఇలా ‘హిట్ 2’ చూసిన వాళ్లు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే అందరూ చెప్తున్న కామన్ పాయింట్స్.. “ఇంటర్వెల్ అదిరిపోయింది.
‘హిట్ 3’ హీరో ఇతనే..
‘హిట్ 2’ సైకో కిల్లర్ ఇతనే, ‘హిట్ 3’లో హీరో ఇతనే క్లైమాక్స్ లో రివీల్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్తున్నాం అనే విషయం కూడా మరిచిపోయిన కొందరు సినీ అభిమానులు ఫోన్ లో వీడియోస్ తీసి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి ట్విస్ట్ లన్నీ లీక్ చేస్తున్నారు. ఇది థ్రిల్లర్ సినిమా, ట్విస్ట్ లీక్ చేస్తే మన తర్వాత సినిమాకి వచ్చే ఆడియన్స్ కి కిక్ ఉండడు, సర్ప్రైజ్ మిస్ అవుతాడు అనే విషయాన్ని మర్చిపోయి అత్యుత్సాహంతో కొందరు చేస్తున్న ఈ పని వాళ్ల సినిమాపై ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం ఉంది. ‘హిట్ 2’ రిలీజ్ కి ముందు నుంచీ చిత్ర యూనిట్ ట్విస్ట్ లు లీక్ చెయ్యొద్దు, ఇది మా రెండేళ్ల కష్టం అంటూ దండం పెట్టి అడిగింది. ఒక్కరు కూడా వినకుండా, ‘హిట్ 3’ హీరో ఇతనే అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
Reliance Industries: భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. టాప్10 కంపెనీలు ఇవే..