Petrol Fraud: వాహనం ప్రస్తుత రోజుల్లో ఓనిత్యావసర వస్తువు. అయితే.. గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీ సీ బస్సులు, రైల్వేను ఆశ్రయించే వారు. ఇక.. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది వాహనాలను వినియోగిస్తూ ప్రజలు తమ పనుల ను చేసుకుంటున్నారు. మనం ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా.. వాహనం నడవాలంటే పెట్రోల్, డీజిల్ కీలకం. తమ బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ బంక్‌లో పెట్రోల్, డీజిల్‌ను వాహనాలలో పోయించుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అసలే ధరల పెరుగుదల ఒకవైపు.. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్ లో మామూలుగానే మోసాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ లీటర్ పెట్రోల్ బదులు అరలీటర్ వేయడంతో ప్రయాణికులు లబోదిబో మంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే ఇక్కడే అసలు మోసం బయట పడింది. తను లీటర్ పెట్రోల్ పోయమంటే.. అరలీటర్ పోయడం గమనించాడు. తను లీటర్ వేయమన్నాను కానీ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అరలీటరే పోసాడంటూ నిలదీసాడు.. కానీ.. పెట్రల్ బంక్ నిర్వాహకులు ఎవరూ స్పందించలేదు. అయితే.. విషయం గుర్తించి సదరు యువకుడు వారితో గొడవకు దిగాడు. ఎవరూ సరైన స్పందన లేకపోవడంతో పెట్రోల్ బంక్ లోనే పెట్రోల్ బాటిళ్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. వారందరూ.. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. మోసానికి పాల్పడిన పెట్రోల్ బంకును సీజ్ చేశారు. అయితూ.. అనుమానం వచ్చి మూడు బాటిళ్లలో మూడు లీటర్ల పెట్రోల్ చొప్పున పెట్రోల్ పోయించుకోగా అందులో ఒక్క బాటిల్ లో మాత్రమే సరిగా పెట్రోల్ పోశారు. ఈ..విషయమై పెట్రోల్ బంకు నిర్వాహకులను నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వలేదని బాధిత ద్విచక్ర వాహనదారుడు వాపోయాడు. అందుకే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఇలా పెట్రోల్ బంక్ లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే కఠినంగా శిక్షించాలని, అలాంటి పెట్రోల్ బంక్‌లను సీజ్ చేయాలని సదరు వాహనదారులు కోరుతున్నారు.
Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు