Gold Smuggling : అధికారులు ఎంత నిఘా పెట్టిన బంగారం స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. స్మగ్లింగ్ ఎక్కువగా విమానాల్లో జరుగుతున్న వార్తలను వింటున్నాం. విమాన మార్గాలకే పరిమితమైన బంగారం స్మగ్లింగ్ రైల్వేలకు పాకింది. తాజాగా పట్టుబడిన రెండు బంగారం స్మగ్లింగ్కేసుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని డైరెక్టరేట్ఆఫ్ఇంటెలిజెన్స్రెవెన్యూ వారు పట్టుకున్నారు. సికింద్రాబాద్, శ్రీకాకుళం రైల్వేస్టేషన్లలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.5.50కోట్లు ఉంటుందని ఇంటెలిజెన్స్బృందాలు తెలుపుతున్నాయి.
Read Also: Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత
ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో స్మగ్లర్లు తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని సిబ్బంది గమనించి… అతని బ్యాగ్ నుంచి 2.314 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.1.32 కోట్లుగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. అతను కోల్కత్తాకు చెందిన స్మగ్లర్గా గుర్తించారు.
Read Also: Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
ఈ నెల 9న కోల్కతా నుంచి వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఏపీలోని శ్రీకాకుళంలో ఓ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్చేశారు. వారు తెచ్చిన ట్రాలీ బ్యాగ్లోపల జిప్లైనింగ్ జేబులో 7.396 కేజీల 24 క్యారెట్లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.21కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే అరెస్ట్ చేసిన నిందితులను ప్రశ్నించగా.. బంగ్లాదేశ్నుంచి బంగారాన్ని స్మగ్లింగ్చేసి కోల్కతాలోని బార్లలో కరిగించి ఇలా తరలిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఇద్దరినీ అధికారులు జ్యూడిషియల్కస్టడీకి తరలించారు.