Telangana Municipal Elections: నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనుంది. అయితే.. నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోతోంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే.. ఎప్పటినుంచో కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూసే పనిలో పడింది పార్టీ నాయకత్వం. కానీ.. కొత్త, పాత వివాదాలను ఎలా సెట్ చేయాలన్నది బిగ్ టాస్క్ గా మారింది. కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తే పాతవాళ్ళని బుజ్జగించడం ఎలా..? అంతా కొత్త నాయకుల వెంట వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తే.. పాత లీడర్స్ పంచాయితీ తేల్చేది ఎవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు.. బీఆర్ఎస్, బీజేపీలు సైతం స్థానికంగా తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
READ MORE: AA 23 : డ్రీమ్ ప్రాజెక్ట్ పై లోకేష్ కనగరాజ్ కామెంట్స్.. ఫీలవుతున్న సూర్య ఫ్యాన్స్