OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా టీమ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ ఇచ్చిన మెమోను నిన్న తెలంగాణ హైకోర్టులో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును రేపటి వరకు సప్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అంటే నేడు, రేపు పెంచిన ధరలకే టికెట్లు అమ్ముకునే వెసలుబాటు ఉందన్నమాట. వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. రెండు రోజుల పాటు మాత్రమే పెరిగిన రేట్లకు అమ్ముకునేందుకు ప్రస్తుతానికి వెసలుబాటు ఉంది. మరి ఆ తర్వాత కోర్టు ఏమైనా తీర్పులో సవరణలు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Jagapati Babu : ఆ కేసులో జగపతిబాబును ప్రశ్నించిన ఈడీ
ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఎన్నో రోజుల తర్వాత మంచి ఫుల మీల్స్ లాంటి సినిమా పడింది. ఓజీ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా మెరిశాడు. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించాడు పవర్ స్టార్. పవన్ యాక్షన్ కు సుజీత్ ఎలివేషన్లు బాగా పండాయి. అందుకే మూవీకి హిట్ టాక్ వచ్చింది. ఇక తమన్ మ్యూజిక్, బీజీఎం మరో హైలెట్. మొత్తానికి చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. మెగా హీరోల నుంచి సామాన్య అభిమానుల దాకా అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతు సంతోషాన్ని పంచుకుంటున్నారు.
Read Also : Rithu Chowdary : ఎంతమందితో ఎఫైర్ పెట్టుకుందో.. రీతూపై గౌతమి ఆరోపణలు