హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.
Group -1 Rankers’ Parents: గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ జవాబు చెబుతామంటూ మీడియా సమావేశం నిర్వహించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పిల్లలు కష్టపడి సాధించిన విజయాన్ని అపహాస్యం చేసే అసత్య ఆరోపణలపై బాధను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు వచ్చామన్నారు.. కేవలం కృషి, ప్రతిభతో విజయం సాధించిన…
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్పందన ప్రకటించారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వానికి “చెంపపెట్టు”గా అభివ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో…
Supreme Court: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో-29 రద్దు చేయాలని పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
TS Group-1: తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక జారీ చేశారు అధికారులు. గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పించింది.
రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మంగళవారం తన వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీని విడుదల చేసింది.