TS Group-1: తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక జారీ చేశారు అధికారులు. గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పించింది. ఇవాళ (మార్చి 23) ఉదయం 10 గంటల నుండి మార్చి 27 సాయంత్రం 5 గంటల వరకు ఈ సవరణ ఎంపిక అందుబాటులో ఉంటుంది. TSPSC సెక్రటరీ నవీన్ నికోలస్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ గ్రూప్-1 ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తుల్లో పేరు, పుట్టిన తేదీ, లింగం, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి తప్పులుంటే మార్చి 27లోగా సరిచేసుకోవచ్చని.. తగిన ధ్రువపత్రాలు సవరణ కోసం అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Read also: Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసందే.. ఫిబ్రవరి 23 నుండి మార్చి 14 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. అయితే చివరి రోజు సర్వర్ మొరాయించడంతో పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 2.7 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అభ్యర్థుల ఫిర్యాదుల కారణంగా దరఖాస్తు గడువును మార్చి 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ TSPSC సెక్రటరీ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.
Wine Shop Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఈనెల 25న వైన్ షాపులు బంద్