Amazon: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది.
Infosys: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడనికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Danam Nagender: హైదరాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. పేద ప్రజల జీవన ఆధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారు.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
Kite Festival: సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
ఈ నెల 10 నుంచి తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తున్నారు. గత ఏడాది కాలంగా తమ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని నెట్ వర్క్ హాస్పిటల్ 10వ తేదీ డెడ్ లైన్ విధించాయి. పెండింగ్ బకాయిల వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తెలిపాయి. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో రూ. 675 కోట్లు బకాయిలు చెల్లించలేదని వెల్లడించాయి. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 920 కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీ కి చెల్లించింది.. ఇప్పటికీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేయగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు.
Telangana Govt: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Dharani Portal: ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల నిర్వహణ కోసం ఆ సంస్థతో రేవంత్ సర్కార్ ఒప్పందాన్ని చేసుకుంది.